
ఘనంగా ప్రపంచ నాటక దినోత్సవ కార్యక్రమం
ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నాగంపల్లి గ్రామంలో చేపట్టిన శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటకాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, బీజీఏ థియేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాటకాన్ని ఐదు రోజులుగా ప్రదర్శించనున్నట్లు థియేటర్ వర్క్ షాప్ ట్రైనర్, నాటక దర్శకులు కాడం బుగ్గప్ప తెలిపారు.