ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ధరణి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ధరణి దరఖాస్తుల పెండింగ్ పై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.