AP: కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్) , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. (కేఎస్‌పీఎల్) యజమాని కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుపై ఈడీ ప్రాథమిక విచారణ జరిపింది. భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించింది. ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి, వై.విక్రాంత్ రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.