ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

70చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, ఏలూరు, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

సంబంధిత పోస్ట్