
BREAKING: మాజీ కార్పొరేటర్ సంజన్న దారుణ హత్య
AP: కర్నూలులో దారుణ హత్య చోటు చేసుకుంది. నగరంలోని షరీఫ్ నగర్ కు చెందిన వైసీపీ కార్పొరేటర్ జయన్న తండ్రి మాజీ కార్పొరేటర్ సంజన్నపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి చంపేశారు. సమాచారం ఆదుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సంజన్న మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.