AP: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో జనసేన జయకేతనం సభలో తోపులాట చోటుచేసుకుంది. జన సైనికులు మహిళా గ్యాలరీ వైపు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ తోపులాటలో కొందరు కార్యకర్తలకు అస్వస్థతకు గురయ్యారు. అంబులె న్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.