ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం (వీడియో)
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరానికి చెందిన ఏపీఎంసీ మార్కెట్ ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న సిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్‌లో బుధవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే గ్యాస్ సిలిండర్ల నుంచి రెండు, మూడు సార్లు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.