పండగ పూట తీవ్ర విషాదం
AP: పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలంలో జరిగింది. గొల్లపాలేనికి చెందిన అన్నదమ్ముల్లో ఒకరైన గంగాధర్‌కు గుండెపోటు వచ్చింది. అన్నతో పాటు ఆస్పత్రికి తమ్ముడు గోపి కూడా వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లేసరికి గంగాధర్ మృతి చెందారు. డాక్టర్ మరణవార్త చెబుతుండగా గోపికి గుండెపోటు వచ్చింది. దాంతో అతనూ చనిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.