AP: ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ తీరు మార్చుకోవడం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలకు వైసీపీ నేతలు పండుగను కూడా వదలడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఈ సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చారని మంత్రి స్పష్టం చేశారు.