HYD నుంచి వియత్నాంకు విమాన సర్వీస్.. ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్ జెట్ సంస్థ వచ్చే మార్చి 18 నుంచి నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు (మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లెట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.