Top 10 viral news 🔥
విజయవాడలో అల్లు అర్జున్ అభిమానుల సందడి
AP: విజయవాడలో పుష్ప-2 మేనియా తారాస్థాయికి చేరింది. ప్రీమియర్ షో నేపథ్యంలో థియేటర్ల వద్ద అల్లు అర్జున్ అభిమానుల సందడి నెలకొంది. పెద్ద ఎత్తున శైలజ థియేటర్ వద్దకు చేరుకుని బన్నీ సినిమా పాటలకు ఫ్లెక్సీలు పట్టుకుని డ్యాన్సులు చేశారు. టపాసులు పేల్చి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.