AP: కడప జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్లో తరగతి గదిలోనే ఉపాధ్యాయుడు కుప్పకూలాడు. విద్యార్థులు అల్లరి చేస్తుండగా వారిపై కేకలు వేసే సమయంలో ఉపాధ్యాయుడు ఎజాస్ అహ్మద్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. రాయచోటి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, తన భర్తది గుండెపోటు కాదని.. తరగతి గదిలో ముగ్గురు విద్యార్థులు బలంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపించారు.