మత్తు రాసిన మరణ శాసనం
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మద్యం మత్తులో కన్నకొడుకును తండ్రే హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కఠారి రమణ (70) పట్టణంలోని లక్ష్మీనగర్‌లో నివాసముంటున్నారు. భార్య సత్యవతి మరణించింది. వీరికి కుమారుడు భాస్కరరావు (32), కుమార్తె పావని ఉన్నారు. ఇంట్లో మద్యం తాగుతున్న కొడుకుతో తండ్రి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తండ్రి కర్రతో కొడుకు తలపై గట్టిగా కొట్టాడు. దాంతో భాస్కరరావు అక్కడికక్కడే కుప్పకూలాడు.