మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించే అవేర్నెస్ ప్రోగ్రాంపై జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. 2021-22 సంవత్సరానికి గాను "సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్" ఢిల్లీ సంస్థ నిర్వహించిన సర్వేలో ద చేంజ్ మేకర్ కాన్‌క్లేవ్ విభాగంలో పురపాలకానికి ఈ అవార్డు లభించినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్ కూడా అందించారన్నారు.