Top 10 viral news 🔥
గ్రామ, సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక మార్పులు
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆదివారం నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒకసారి మాత్రమే హాజరు నమోదైతే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు SMS రూపంలో సమాచారం తెలియజేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని SMSలో తెలిపారు.