TG: హైదరాబాద్ చర్లపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని ఓ కారు ఢీకొట్టడంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. పేరెంట్స్ తో కలసి బంధువుల ఇంట్లో వేడుకకు వచ్చిన ఆద్య(9) ఇంటి ముందు ఆడుకుంటుండగా.. రివర్స్ చేస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.