ప్రాణం తీసిన పాన్‌.. రన్నింగ్ బస్సు నుంచి కింద పడి వ్యక్తి మృతి

1086చూసినవారు
ప్రాణం తీసిన పాన్‌.. రన్నింగ్ బస్సు నుంచి కింద పడి వ్యక్తి మృతి
ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన ఏసీ బస్సు అజంగఢ్ నుంచి లక్నో వెళ్తుండగా, ఆ బస్సులో ప్రయాణిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి, పాన్ ఉమ్మేందుకు బస్సు డోర్‌ తెరిచాడు. బస్సు స్పీడ్‌గా ఉండటంతో అతడు బ్యాలెన్స్‌ తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మృతుడిని లక్నోలోని చిన్‌హట్ ప్రాంతానికి చెందిన రామ్ జివాన్‌గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్