నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

50చూసినవారు
నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు
AP: ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమ వారాల్లో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. గంటలకు 90 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు రేపటి వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్