ఆట స్టలం విషయంలో గొడవ.. యువకుడి హత్య
AP: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఉదయగిరి మండలం కొండాయిపాలెంలో యువకుడు హత్యకు గురయ్యారు. చర్చి సమీపంలోని ఆట స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారని ఓ వర్గం రెచ్చిపోయింది. దాంతో ఇరువర్గాలు దాడులకు దిగారు. కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో అభిషేక్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ మృతి చెందారు.