AP: దేశ చరిత్రలోనే రతన్ టాటా పేరు ఒక బ్రాండ్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విలువలతో వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని చెప్పారు. సోమవారం ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరంలో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో టాటా ముందుకెళ్లారని, నష్టాల్లో ఉన్న కంపెనీలను లాభాల బాట పట్టించారని కొనియాడారు.