తిరుపతి ఘటన.. భక్తులను లాగిపడేసిన పోలీసులు (వీడియో)
తిరుపతి తొక్కిసలాటకు అధికారుల ప్రవర్తన, నిర్లక్ష్యం కూడా ఓ కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గేటు వద్ద నిలబడ్డ పోలీసులు భక్తులను ఇష్టం వచ్చినట్లు లాగి పడేశారు. ఈక్రమంలో కొందరు కిందపడిపోయారు. మహిళలని చూడకుండా దారుణంగా ప్రవర్తించారు. భక్తులపై ఓ పోలీస్ లాఠీఛార్జ్ చేశాడు. ఇది కూడా తొక్కిసలాటకు ఓ కారణమని, అక్కడున్న పోలీసులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.