ఏపీలో మరోసారి భూకంపం

80చూసినవారు
ఏపీలో మరోసారి భూకంపం
AP: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బుధవారం రాత్రి 10:56 గంటలకు 2 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని తెలిపారు. దీంతో ఇచ్ఛాపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం అక్టోబరులోనూ ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్