Top 10 viral news 🔥
BREAKING: యువతిని తగలబెట్టిన ప్రేమోన్మాది (వీడియో)
AP: నంద్యాల జిల్లా బైరెడ్డి నగర్లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని లహరిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో లహరి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే యువకుడు సైతం నిప్పంటించుకోగా.. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నిందితుడు కొమిలిగుండ్లకు చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కోపంతోనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.