ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపు ఈ-మెయిళ్లు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. పాఠశాలల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని ఆగంతకులు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.