టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

64చూసినవారు
టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం
AP: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. కాకినాడ జేఎన్టీయూలో ఉ. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్లపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం రాకపోతే.. రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. కాగా, డిసెంబర్ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 15,490 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్