ఏపీలో నేటి నుంచి పింఛన్ల తనిఖీలు

70చూసినవారు
ఏపీలో నేటి నుంచి పింఛన్ల తనిఖీలు
AP: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు అధికారులు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు. నకిలీ పింఛన్‌దారులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందికి డ్యూటీ వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్