పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్
AP: టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ-3 నారాయణరెడ్డి, ఏ-4 రేఖమయ్య, ఏ-5 రంగనాయకులు, ఏ-6 వడ్డే కొండ, ఏ-8 ఓబిరెడ్డికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్ మంజూరు కావడం గమనార్హం.