మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నివాళులర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని చంపాపేటలోని మందా జగన్నాధం నివాసంలో ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, ఆయన మరణం తీరని లోటని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేసారు