వైఎస్ జగన్పై షర్మిల మరోసారి ఫైర్
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి జగన్పై ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా.. ‘తమకు 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి జగన్ ప్రజలకు తీరని అన్యాయం చేశారు. విభజన హామీలు బుట్టదాఖలు చేయడంలో మోదీ, చంద్రబాబు, జగన్ ముద్దాయిలు. విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఏపీ దశ దిశ మారాలంటే విజన్లు కాదు. విభజన హామీలు.’ అని పోస్టు పెట్టారు.