భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని నిరసిస్తూ బుధవారం నారాయణపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రభుత్వమే అమలు చేయాలని ఈనెల 23 న హైద్రాబాద్ లోని రాష్ట్ర సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని అన్నారు.