పవిత్ర స్నానాలు.. 43 మంది మృతి
‘జీవిత్పుత్రిక’ పండగ నేపథ్యంలో బిహార్లోని నదులు, ఇతర జలవనరుల్లో పవిత్ర స్నానాలకు భారీగా ప్రజలు పోటెత్తారు. స్నానాలు చేసే క్రమంలో 15 జిల్లాల్లో 37 మంది చిన్నారులు సహా 43 మంది మృతి చెందారని, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారుల వెల్లడించారు. ఈ విషాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.