ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ 'దేవర' తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న తారక్.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లండన్లో చిల్ అవుతున్నాడు. అక్కడ హైడ్ పార్క్లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఆనందంగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దీంతో ఆ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.