తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటలీలోని పాలిటెక్నికో డి టోరినోలో ఆర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్‌లో మాస్టర్స్‌లో సీటొచ్చినా.. వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేని విద్యార్థిని ప్రణవి చొల్లేటి పరిస్థితిపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు.ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఇంటికి పిలిపించుకొని.. తన కుమారుడి పేరు మీద ఉన్న ప్రతీక్ ఫౌండేషన్ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.ఇంకా తన చదువుకు అండగా ఉంటానని హామీచ్చారు.