ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎన్ఎన్ఎల్ తమ యూజర్ల కోసం మంచి ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. రూ.500 లేదా అంత కంటే తక్కువ ధర ఉండే రీఛార్జ్ ప్లాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తోంది. అయితే ఈ బంపర్ ఆఫర్ 2024 డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నియో ప్లాన్, బేసిక్ ప్లాన్‌లను 3 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే డిస్కౌంట్ కూడా అందిస్తోంది.