సన్న రకం వరి ధాన్యం అమ్మిన రైతులకు బోనస్ బకాయిలు చెల్లించాలని కోరుతూ బుధవారం నారాయణపేట కలెక్టరేట్ ఏవో జయసుధకు వినతి పత్రం అందించినట్లు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులకు ఇప్పటికీ బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని అన్నారు. ప్రభుత్వం సన్న వడ్లు పండించిన వారికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తోందని అన్నారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.