మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో వెల్లడవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ గతేడాది ఖాళీగా కనిపించగా.. తాజాగా తీసిన చిత్రంలో మౌలిక సదుపాయాలతో ఆ పార్క్ కూడా దర్శనమిచ్చింది.