చనిపోయిన వారి పేరుతో సైబర్ వల
AP: సైబర్ నేరగాళ్లు కొంత పంథా మొదలుపెట్టారు. చనిపోయిన వారి పేరుతో కుటుంబ సభ్యులకు వల వేస్తున్నారు. తాజాగా కడపలోని అంగడివీధికి చెందిన ఓ వ్యక్తి తల్లి చనిపోయింది. అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి సదరు వ్యక్తికి ఫోన్ చేసిన కేటుగాడు.. మీ అమ్మ పాలసీకి సంబంధించి చివరి కిస్తీ కట్టలేదు. రూ. 5వేలు కడితే రూ. 5లక్షలు వస్తాయి, ఫోన్‌పే చేయండి అని మాట్లాడాడు. పాలసీ తాలూకు వివరాలు అడగడంతో ఫోన్ కట్ చేశాడు.