డబ్బు కోసం కన్నకొడుకు, కోడలిపై పెట్రోలు పోసి నిప్పెట్టాడు

569చూసినవారు
డబ్బు కోసం కన్నకొడుకు, కోడలిపై పెట్రోలు పోసి నిప్పెట్టాడు
ఒడిశాలోని కటక్ జిల్లాలో డబ్బు కోసం కన్నకొడుకు, కోడలిపై పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోవర్ధన్‌(65) ఇటీవల తన ఏకైక కుమారుడు దీనబంధు(40)కు పూజ(32)తో వివాహం చేశాడు. తన అవసరాలకు డబ్బులు కావాలని వారిద్దరితో గోవర్ధన్ గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంలో శనివారం రాత్రి గోవర్ధన్ కొడుకు, కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో పూజ మృతి చెందగా దీనబంధు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సంబంధిత పోస్ట్