ఇన్‌ప్లుయెన్సర్ మమతా రాయ్‌పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వారణాసిలోని కాళ భైరవ ఆలయంలో మమతా రాయ్ బర్త్ డే కేక్ కట్ చేయడం వివాదస్పదమైంది. అంతేకాకుండా దేవుడి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి వీడియో షూట్ చేశారు. దీనిపై భక్తులు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మమతా రాయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.