
పిడిగుద్దులాటకు పోలీసులు పర్మిషన్
TG: దేశ వ్యాప్తంగా ఘనంగా హోలీ జరుగుతున్నా.. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని హున్నా గ్రామంలో ఈ వింత ఆచారం అమలులో ఉంది. గ్రామస్థులందరూ ఒకచోట చేరి పిడిగుద్దులతో కొట్టుకుంటారు. అయితే, పిడిగుద్దులాటకు పోలీసులు షరుతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఐదు నిమిషాల పాటు పిడిగుద్దులాటకు ఒప్పుకున్నారు. దీంతో, హనుమాన్ ఆలయం వద్దకు గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. కాగా, ఈ ఆట తమ ఆచారం అని గ్రామస్థులు అంటున్నారు.