నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్' శుక్రవారం విడుదలై హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రంలో మంగపతి పాత్ర పోషించిన హీరో, యాక్టర్ శివాజీ స్పందించారు. 'కోర్ట్ సినిమాలో చేసిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల. నాని ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మంగపతి క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది' అని అన్నారు.