AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు చేసింది. ‘సూపర్ సిక్స్ హామీలు అమలుకు డబ్బుల్లేవని బీద ఏడుపు ఏడ్చే పవన్‌కు ప్రజల డబ్బంటే లెక్కలేదు. గన్నవరం నుంచి మంగళగిరికి కూడా లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతారు. ప్రజలు అవస్థల్లో ఉన్నపుడు మాత్రం ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. అటు కాశి నాయన సత్రాలు కూల్చేసినా.. ఇటు మహిళలమీద వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు’ అని ట్వీట్ చేసింది.