మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు అందుగుల శ్రీనివాస్, సూరిబాబు, మేడిపల్లి సంపత్, ఊరుకొండ రాజశేఖర్, ఆర్ వెంకన్న సురేష్ కుమార్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. పాలకవర్గం లేక మంద వారి పట్టణం అభివృద్ధికి నోచుకోవడం లేదని గత ప్రభుత్వాలు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశాయని పేర్కొన్నారు.