OCT 1న తిరుమలకు పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకుని ఆయన దీక్షను విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహిస్తారు.