ప్రకాశ్ రాజ్‌కు పవన్ సీరియస్ వార్నింగ్
హిందువులైన కొందరు వ్యక్తులు కూడా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ మాట్లాడుతూ.. ‘ప్రకాశ్ రాజ్ అంటే నాకు గౌరవం. సెక్యూలరిజం అంటే ఒకవైపు మాత్రమే ఉండటం. కేవలం హిందువుల విషయం వచ్చినప్పుడే సెక్యూలరిజం ఉండాలని మాట్లాడితే మంచిది కాదు. సనాతన ధర్మంపై దాడి జరిగితే నన్ను మాట్లాడొద్దని చెబితే ఊరుకోను.’ అని అన్నారు.