విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

81చూసినవారు
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటిచెట్లపాలెంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు గాయపడటంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్