ఆన్లైన్లో పేకాట ఆడిన రెవెన్యూ అధికారి (వీడియో)
AP: అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోల హాజరయ్యారు. ఒక వైపు సమావేశం జరుగుతుండగా.. మరోవైపు మలోల ఆన్లైన్లో పేకాట ఆడారు. పలు సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా పట్టనట్లు వ్యవహరించారు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.