AP: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఏపీకి చెందిన ఓ జవాన్ వీర మరణం పొందారు. జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్ (32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. కార్తీక్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు.