కుంభమేళా తాత్కాలిక ఆస్పత్రిలో ప్రసవం

62చూసినవారు
కుంభమేళా తాత్కాలిక ఆస్పత్రిలో ప్రసవం
మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ కుంభమేళా జరుగనుంది. ఇందులో భాగంగా కుంభమేళాకు వచ్చిన భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో ఓ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కుంభమేళాకు ముందు ఈ ఆసుపత్రిలో వైద్యులు తొలి ప్రసవం చేశారు. సోనమ్ (20) అనే మహిళకు మగ బిడ్డ పుట్టాడని.. కుంభమేళా జరిగే చోట పుట్టినందుకు చిన్నారికి ‘మహాకుంభ్‌’గా నామకరణం చేశారని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్