ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్‌ విద్యార్థి బలి

84చూసినవారు
ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్‌ విద్యార్థి బలి
గుజరాత్‌లో సీనియర్ల ర్యాగింగ్‌కు ఓ వైద్య విద్యార్థి బలయ్యాడు. పటాన్‌లోని ధర్‌పూర్‌లో గల GMERS మెడికల్‌ వైద్య కళాశాలలో అనిల్‌ మథానియా అనే విద్యార్థి MBBS మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, శనివారం రాత్రి ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులపై సీరియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌లో భాగంగా అనిల్‌ను దాదాపు మూడు గంటల పాటు నిలబెట్టారు. దీంతో అనిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్